![]() |
![]() |

రీసెంట్ చక్కని అమ్మాయిని పెళ్లి చేసుకుని కొత్త పెళ్లికొడుకుగా కిస్సిక్ టాక్స్ షోకి వచ్చాడు పటాస్ ప్రవీణ్. ఈ ఇంటర్వ్యూలో తన జీవితంలో జరిగిన ఎన్నో విషయాలని చెప్పుకొచ్చాడు. ఆ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది.
"ఎట్లా ఉంటది అమ్మాయి" అని వర్ష అడిగింది. "మంచిగా ఉంటది అమ్మాయి. ఈ జీవితానికి అర్ధం చేసుకునే వైఫ్ చాలబ్బా" అన్నాడు. "ప్రస్తుతం నువ్వేం చేస్తున్నావ్ ప్రవీణ్" అని హోస్ట్ వర్ష అడిగింది. "ప్రస్తుతానికి జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ, కొన్ని సినిమా ప్రాజెక్ట్స్ వచ్చాయి." అని చెప్పాడు. "హే హీరో" అంటూ వర్ష అరిచింది. "నాకే హీరోగా అవకాశం వస్తే నువ్వే నా హీరోయిన్ వి" అన్నాడు. దానికి వర్ష సిగ్గుపడిపోయింది. "ఎం చేయాలి ప్రవీణ్ అందులో" అని అడిగింది. "లవ్ యు బచ్చే క్యారెక్టర్ అందులో అలాగే చేయాలి" అన్నాడు. దాంతో వర్ష కొంచెం ఫీలయ్యింది.
ఎందుకంటే గతంలో ఒక ఎపిసోడ్ లో కుంభమేళాలో పూసలమ్ముకునే అమ్మాయిలా గెటప్ వేసుకొచ్చి లవ్ యు బచ్చే అంది . దానికి ఇప్పుడు ప్రవీణ్ ఇలా కౌంటర్ ఇచ్చాడు. కొంతమందికి డబ్బు బాగా పొగరును ఇస్తుంది. లెక్కచేయడు. ఒంటి మీద ఎలాంటి బట్టలతో రాలేదు. చనిపోయినప్పుడు ఒంటి మీద లక్ష రూపాయల బట్టలున్నాయి. ఆ బట్టలకు విలువుంది అతనికి లేదు. అతను కట్టిన ఇంటికి విలువుంది అతనికి లేదు, అతని కార్ కి విలువుంది అతనికి లేదు. చివరికి చనిపోయాక శవాన్ని తీసుకొచ్చి వరి గడ్డి వేసి బయట పెట్టి ఒక టెంట్ వేస్తారు. అక్కడ ఏది నీది ? అంటూ బతుకు సారాన్ని మూడు ముక్కల్లో చెప్పాడు. ఇక తనకు సడెన్ కోటి రూపాయలు ఇస్తే అమ్మానాన్న పేరు మీద ఆశ్రమం కట్టాలి అని చెప్పాడు. ఇక నెటిజన్స్ ఐతే "జీవితం నీకు చాలా నేర్పింది ప్రవీణ్. గాడ్ బ్లేస్ యు. నిజం ప్రవీణ్" అని కామెంట్స్ చేశారు.
![]() |
![]() |